30 నిమిషాల్లో  రూ. 4 లక్షల సొత్తు రికవరీ!.. సైఫాబాద్ పోలీసులు బాధితురాలికి అప్పగింత

30 నిమిషాల్లో  రూ. 4 లక్షల సొత్తు రికవరీ!.. సైఫాబాద్ పోలీసులు బాధితురాలికి అప్పగింత

బషీర్​బాగ్, వెలుగు: రాపిడో ఆటోలో పొరపాటున వదిలేసిన సుమారు రూ. 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును సైఫాబాద్ పోలీసులు కేవలం 30 నిమిషాల్లోనే రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. తమిళనాడుకు చెందిన మణిమేగల ఈ నెల 27న రాత్రి లక్డీకాపూల్ వద్ద తన హ్యాండ్​బ్యాగ్​ను ఆటోలో మర్చిపోయింది. అందులో 27 గ్రాముల బంగారం, రూ. 30 వేల నగదుతోపాటు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి.  బాధితురాలి ఫిర్యాదుపై వెంటనే రంగంలోకి దిగిన సీఐ ఎ. సీతయ్య బృందం.. సాంకేతిక ఆధారాలతో ఆటో డ్రైవర్​ను చాదర్​ఘాట్ వద్ద గుర్తించి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించిన పోలీసుల పనితీరుపై బాధితురాలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.